అలా జరుగుతుందేమో అనే భయంతో.. ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య?

praveen
నేటి రోజుల్లో మనుషుల ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. అవును నిజమే.. మనిషి తన జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు చేసుకుంటున్నాడు. వేసుకునే బట్టల దగ్గర నుంచి ఏకంగా తినే ఆహారం వరకు అన్నింటిలో కూడా మార్పు వచ్చింది. ఇక చేసే ఉద్యోగాల్లో కూడా ఇలాంటి మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు ఏకంగా శారీరక శ్రమ ఉండే ఉద్యోగాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే చోట గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పాలీ.

 ఇలా మనిషి జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. అదే సమయంలో ఇక మనిషిలో విచక్షణ జ్ఞానం కూడా కాలానుగుణంగా తగ్గిపోతుంది ఏమో అనే భావన కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే చిన్నచిన్న సమస్యలకే అంతటితో జీవితం ముగిసిపోయింది అని కుంగిపోతూ ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏ చిన్న సమస్య వచ్చిన పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్నట్లుగా ఆలోచన తీరు మారిపోయింది అని చెప్పాలి.

 ఎంతో మంది క్షణికావేషంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపేస్తున్నాయ్. ఎంతోమంది తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో అయితే ఎంతోమంది విద్యార్థులు ఒక చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఒక విద్యార్థి ఇలాంటి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. పరీక్షల్లో ఫైల్ అవుతానేమో అనే భయంతో ఏకంగా ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. బిస్రత్ కు చెందిన 14 ఏళ్ళ విద్యార్థి ఇటీవల ఏడవ తరగతి వార్షిక పరీక్షలు రాశాడు. ఇటీవల ఫలితాలు వస్తాయని తెలియడంతో ఫెయిల్ అవుతానని భయపడ్డాడు. దీంతో తన నివసించే సొసైటీ 22వ అంతస్థు నుంచి కిందికి దూకడంతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: