ఇతను మనిషా మృగమా.. తనను కరిచిన కుక్కపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో తెలుసా?

praveen
సాధారణంగా మనిషి అంటే మానవత్వానికి జాలి దయ అనే గుణానికి కేరాఫ్ అడ్రెస్. ఇక ఇలాంటి ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి కాబట్టే జంతువులకి మనుషులకు తేడా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో మాత్రం మనుషుల్లో మానవత్వం అనే గుణం పూర్తిగా కనుమరుగై పోతుందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా రాక్షసత్వంతోనే  ఆలోచిస్తున్నాడు మనిషి. ఏకంగా సైకోలాగా ప్రవర్తిస్తూ సభ్య సమాజాన్ని భయపడే విధంగా మనిషి ప్రవర్తన తీరు మారిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా  వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా మనుషులకి కుక్కలకి మధ్య పుట్టుకతోనే వైరం కొనసాగుతుందేమో అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయ్. కళ్ళ ముందు మనుషులు కనిపించారు అంటే దారుణంగా దాడి చేస్తున్నాయి కుక్కలు. ఇలా కుక్కల దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కుక్క మనిషి పై దాడి చేసింది. దానికి రివెంజ్ గా మనిషి కుక్కపై కూడా దాడి చేశాడు. ఏకంగా అత్యంత రాక్షసత్వంతో కుక్కను హింసించాడు.

 ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. నగృత భగవాన్ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. వైదేహి అనే పేరు గల శునకం స్థానికంగా ఉంటున్న ఒక వ్యక్తిని కరిచింది. దీంతో అతని కోపం నషాలానికి అంటింది. ఇక తనను కలిసిన ఆ కుక్కను గదిలో కట్టేసి గత కొన్ని రోజులుగా చిత్రహింసలు పెడుతున్నాడు. ఏకంగా ఆ కుక్క కళ్ళు సైతం పొడిచేశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ కుక్కను ఆసుపత్రికి తరలించి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: