యూపీలో వింత ఘటన.. పెళ్లికి వరుడు డుమ్మా.. వధువు ఏం చేసిందంటే?

praveen
పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పెద్దలు. ఇక యువతి యువకులు కూడా పెళ్లిపై కోటి ఆశలు పెట్టుకుంటారు అన్న విషయం తెలిసిందే. అర్థం చేసుకునే భాగస్వామి వస్తే జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండవచ్చు అని ఆశ పడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పెళ్లి అనేది కేవలం కమర్షియల్ ఎలిమెంట్ గా మాత్రమే మారిపోయింది.

బాగా అర్థం చేసుకునే వారిని కాదు ఏకంగా బాగా కట్నం ముట్ట చెప్పే వారిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు అబ్బాయిలు, అమ్మాయిలు. మంచి ప్యాకేజీతో జీతం ఉంటే చాలు అబ్బాయి బాలేకున్న పెళ్లికి ఒకే చెప్పేస్తున్నారు అమ్మాయిలు. ఇక బాగా కట్నం ఇస్తున్నారు అంటే చాలు అమ్మాయి ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా పెళ్లికి రెడీ అవుతున్నారు అబ్బాయిలు. ఇంతలా నేటి రోజుల్లో పెళ్లి ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలా పెళ్లి అనే తంతు ఎంత కమర్షియల్ గా మారిపోయింది అన్నదానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనంగా మారిపోయింది అని చెప్పాలి.
 ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఒక వింత ఘటన జరిగింది. పెళ్లికూతురు మెడలో తాళి కట్టాల్సిన వరుడు తీరా పెళ్లి సమయానికి డుమా కొట్టాడు. దీంతో వధువు వెనకడుగు వేయకుండా అతడి సోదరుడిని పెళ్లాడింది. అయితే ఇలా వధువు పెళ్ళి విషయంలో తొందరగా పడడానికి గల కారణం ఏంటో తెలియడంతో అధికారులకు సైతం షాక్ అయ్యారు. యూపీ ప్రభుత్వం మాస్ మ్యారేజ్ స్కీం కింద పెళ్లి చేసుకున్న వారికి 51 వేల రూపాయల  నగదు అందిస్తుంది. అయితే ఈ డబ్బులు పొందాలి అని ఉద్దేశంతోనే సదరు యువతీ చివరికి వరుడు లేకపోయినా వరుడు తమ్ముడు తో పెళ్లికి సిద్ధమైంది అన్న విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: