ఇది నిజంగా విడ్డూరమే.. పంటి చికిత్స కోసం ఎయిర్ కోర్స్ లోకి వెళ్ళాడు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంటుంది. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరిని అవాక్కయ్యేలా  చేస్తూ ఉంటాయ్. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటిదే   ఏకంగా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీలోకి అందరికీ ఎంట్రీ ఉండదు.

 ఇలా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీలోకి వెళ్ళాలి అంటే ఇక వారికి ప్రత్యేకమైన ఐడి కార్డ్ లేదా పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడొక వ్యక్తి మాత్రం ఏకంగా ఎంతో సులభంగా ఫేక్ డాక్యుమెంట్లతో ఎయిర్ ఫోర్సు స్టేషన్ లోకి ఎంటర్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత అధికారులకు దొరికిపోయాడు. అయితే ఇలా అధికారులకు దొరికిపోయిన సమయంలో అతను చెప్పిన సమాధానం విని ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఇంతకీ అతను ఏం ఆన్సర్ ఇచ్చాడో తెలుసా ఏకంగా పంటినొప్పి కారణంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వైద్యం చేయించుకోవడానికి వచ్చాను అంటూ అతను చెప్పిన సమాధానంతో ముక్కున వేలేసుకున్నారు అధికారులు.

 ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా వింగ్ కమాండర్ మీ అంటూ ఫేక్ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకున్నాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చి చివరికి అధికారులకు దొరికిపోయాడు. అయితే అలా చేయడానికి అతను చెప్పిన కారణం మాత్రం అధికారులను నివ్వెర పోయేలా చేసింది అని చెప్పాలి. ఎయిర్ ఫోర్స్ డెంటల్ ఆసుపత్రిలో పంటి చికిత్స కోసమే ఈ నాటకం ఆడాను అంటూ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. నిందితుడు మలక్ గంజికి చెందిన వినాయక్ చద్దాగా అధికారులు గుర్తించారు. అతని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అతని దగ్గర నుంచి ఏకంగా ఐదు నకిలీ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: