అయ్యోదేవుడా.. వాళ్ళకి కడుపు కోత మిగిల్చావు కదయ్యా?

praveen
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని భయపెడుతున్న విషయం ఏదైనా ఉంది అంటే అది సడన్ హార్ట్ ఎటాకులు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కరోనా వైరస్ అనే కనిపించని శత్రువుతో ప్రపంచం మొత్తం మాస్క్ అనే ఆయుధంతో యుద్ధం చేసింది. అయితే ప్రస్తుతం ఇక వైరస్ ప్రభావం తగ్గిపోవడంతో హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇక ఇప్పుడు సడన్ హార్ట్ ఎటాక్ లు ప్రతి ఒక్కరు కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 సడన్ హార్ట్ ఎటాకులు ఎప్పుడు ఎవరికీ వస్తాయి అన్నది ఊహకందని విధంగా మారిపోయింది  ఇక ఆరోగ్యం బాగాలేని వారికి లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి మాత్రమే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది ఒకప్పుడు నమ్మేవారు. గుండెపోటు వచ్చిన ఒకేసారికి మరణించరు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు సడన్ హార్ట్ ఎటాకులు మాత్రం చూస్తూ చూస్తుండగానే మనిషి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. అప్పుడు వరకు కళ్ళ ముందే నవ్వుతూ కనిపించిన వారు చూస్తూ చూస్తుండగానే కుప్పకూలిపోయి సెకండ్ల వ్యాధిలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అయితే అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఇలా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక తెలంగాణలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది.

 ఏకంగా తొమ్మిది ఏళ్ల బాలుడు విషయంలో విధి కాస్తయినా జాలి చూపించలేకపోయింది. ఏకంగా సడెన్ హార్ట్ ఎటాక్ రూపంలో అతన్ని మృత్యువు బడిలోకి చేర్చింది. జగిత్యాల జిల్లా థారూర్ కి చెందిన మూడో తరగతి బాలుడు బాలే హర్షిత్ గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబంతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన అతడు అర్ధరాత్రి ఇంటికి తిరిగి చేరుకున్నాడు. ఆ తర్వాత అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్పృహ కూడా కోల్పోయాడు. వెంటనే కంగారుపడిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సడన్ హార్ట్ ఎటాక్ ఇందుకు కారణం అని తెలిపారు. దీంతో అల్లారూ ముద్దుగా పెంచిన కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులందరూ కూడా గుండెలవిసేలా రోదిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: