పాడు బుద్ధి కాకపోతే.. వృద్ధాప్యంలో ఇలాంటి ఆలోచన అవసరమా?

praveen
సాధరణంగా ఇంట్లో కొడుకు కోడలు ఎలాంటి గొడవ పడకుండా అన్యోన్యంగా ఉంటే ఆ కొడుకు తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాకు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక అత్త మాత్రం అలా అనుకోలేదు. కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండడాన్ని చూసి అస్సలు ఓర్వలేకపోయింది. ఈ క్రమంలోనే కోడలిని ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపించాలి అనుకుంది. ఈ క్రమంలోనే వృద్ధాప్యంలో నీచమైన ఆలోచన చేసింది.

 ఇక ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం  వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఓ జంటకు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇటీవలే ఆ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే ఆమె అత్తకు ఆమెపై కక్ష ఉంది. అయితే డెలివరీ సమయంలో అత్తగారు పక్కనే ఉంటాను అంటే వైద్యులు అసలు ఒప్పుకోలేదు. దీంతో వారితో గొడవ పడింది సదర మహిళ.

 దీంతో కొడుకు తల్లిని వేరేచోటికి పంపించేసాడు. తర్వాత ఆమె ఫోన్ చేసి సారీ చెప్పి మరి మళ్ళీ ఇంటికి వచ్చేసింది అత్త. బిడ్డను చూసి ఎంతో బాగున్నాడు అని ప్రేమగా దగ్గర తీసుకుంది. కానీ అలా దగ్గర తీసుకోవడం వెనక మనసులో ఉన్న కుళ్ళు బుద్ధి తర్వాత అందరికీ అర్థమైంది. పాల కోసం కోడలు కిచెన్ లోకి వెళ్ళిందో లేదో భర్త, అత్త అరుపులు వినిపించాయి. దీంతో ఆమె మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి చూడగా బిడ్డ పోలికల కుటుంబంలోనీ ఏ ఒక్కరితో కూడా పోలట్లేదు. తనకు కోడలిపై అనుమానం ఉంది.. డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అంటూ ఒక నీచమైన ఆలోచనను బయటపెట్టింది. దీంతో కోడలు అవమాన భరించలేక కన్నీళ్లు పెట్టింది. నేను డిఎన్ఎ టెస్ట్ కు రెడీ కానీ మీ కుమారుడు మీకే పుట్టినట్లు డిఎన్ఏ టెస్ట్ కు మీరు రెడీనా అంటూ ప్రశ్నించింది. దీంతో భర్త అత్తగారు షాక్ లో మునిగిపోయారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎక్కడ జరిగింది అన్న విషయం మాత్రం తెలియదా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: