చోరికి వెళ్లి.. రూ.21 లక్షలు కాల్చేసిన దొంగలు.. ఏమైందంటే?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగల బెడద రోజురోజుకు ఎక్కువవుతుంది అన్న విషయం తెలిసిందే. పోలీసులు దొంగల ఆట కట్టించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరా నిఘాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు  కేవలం పోలీసులు మాత్రమే కాదు నేటి రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ముందు జాగ్రత్తగా ఇక ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇళ్ల యజమానులు. అయినప్పటికీ దొంగలు ఎంతో చాకచక్యంగా కెమెరాల కంటికి చిక్కకుండా ఇక చోరీలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.

 అయితే తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించాయి అంటే చాలు ఇక ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఇక ఇంటి యజమానులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే చోలికి గురయ్యే ప్రమాదం ఉందని భావించి బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తూ ఉన్నారు. దీంతో చోరీ కోసం ఎంతో కష్టపడి ఇండ్లలోకి చొరబడిన దొంగలకు ఇక ఖాళీ చేతులతోనే బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఇక ఇళ్లల్లో చోరీ చేయడం  కాదు ఇక పక్క డబ్బులు ఉంటాయి అని తెలిసిన ఏటీఎంలో చోరీలు చేయాలని ఆలోచన చేస్తున్నారు దొంగలు.
 దీంతో ఏటీఎం చోరీలు కాస్త అటు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిపోతున్నాయ్. సాధారణంగా చోరీ చేయడానికి వెళ్ళిన దొంగలు దోచుకు వెళ్లడం చూసాము. కానీ ఇక్కడ మాత్రం దొంగలు ఏకంగా దోచుకు వెళ్లడం కాదు డబ్బులు అన్నింటిని కూడా కాల్చివేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగులోకి వచ్చింది  దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో మంటలు చెలరేగి ఏటీఎంలో ఉన్న 21.11 లక్షల రూపాయల డబ్బు ఖాళీ బూడిదైంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: