విధి ఆడిన నాటకం.. మూడున్నరేళ్లకే చిన్నారి మృత్యుఒడిలోకి?

praveen
విధి ఆడిన వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివి మాత్రమే అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే ఇక పెద్దలు ఇలాగే చెబుతూ ఉంటారు. చాదస్తపు మనుషులు కదా. విధి ఆడిన నాటకం ఇవన్నీ వట్టి మాటలే అని అంటూ ఉంటారు నేటి జనరేషన్ పిల్లలు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం నిజంగానే విధి చేతిలో మనుషులు కీలుబొమ్మ లాంటి వారు మాత్రమే అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకంటే అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యమైన ఘటనలు చివరికి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటాయి.



 ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని  నింపుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో సడెన్ హార్ట్ ఎటాక్ల కారణంగా మనుషుల ప్రాణాలు పోతున్న తీరు చూసి నిజంగా విధి మనుషులతో దారుణంగా ఆడుకుంటుంది అని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ సందడి చేసిన బాలుడు ఇక విగత జీవిగా మారడం ఆ కుటుంబం జీవించుకోలేకపోయింది. దీంతో అరణ్య రోదనగా విలపించింది.


 ఈ విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వెలుగులోకి వచ్చింది. పాతకంచెలకు చెందిన నాగకృష్ణ, మౌనిక దంపతులకు కుమారుడు చైతన్ ఉన్నాడు. అప్పడి వరకు కళ్ళముందు ఎంతో సందడిగా ఆడుకుంటూ కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు అతని పాము కాటు వేసింది  దీంతో ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయాడు బాలుడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. విగత జీవిగా మారిన కొడుకును చూసి అరణ్య రోజునగా విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: