కామాంధుడిగా మారిన పోలీస్.. ఏకంగా బర్త్ డే కి పిలిచి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఆడపిల్లల భద్రత రోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అన్నది అర్థమవుతుంది. కామంతో కళ్ళు మూసుకుపోతున్న మనుషులు పెరిగిపోతున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతుంది. అయితే ఒంటరిగా కాదు పక్కన కుటుంబ సభ్యులు ఉన్న వారిపై దాడి చేసీ ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్న మృగాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల మళ్లీ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందో లేదో అని ఆడపిల్ల తల్లిదండ్రులు  అనుక్షణం భయపడుతున్న దుస్థితి నేటి సభ్య సమాజంలో కనిపిస్తుంది.


 అయితే కామాంధులను శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ అటు పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు. అంతకు అంతకు రెచ్చిపోతున్న కామాంధులు ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసిన పాపం అని కన్నీరు పెట్టుకునే పరిస్థితిని తీసుకొస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఎవరైనా వేధింపులకు పాల్పడ్డారు అంటే చాలు ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడం చేస్తూ ఉంటారు బాధితులు. కానీ ఆ పోలీసే కామాంధుడిగా మారితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుర్భర స్థితిలో పడిపోతూ ఉంటారు . ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమందర్ వలి ఏకంగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుట్టినరోజు పేరుతో ఇంటికి పిలిపించి.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు అంటూ తెలిపింది. ఇక మత్తులోకి వెళ్ళిన తర్వాత రేప్ చేసి ఫోన్లో రికార్డు చేశాడు అంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇక పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తాను అంటూ పెద్దింపులకు పాల్పడుతున్నాడు అంటూ తన గోడును వెళ్ళబోసుకుంది. కాగా బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దీనిపై విచారణ చేపడుతున్నామని సిఐ రమేష్ బాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: