దారుణం : అలా చేశారని.. చెప్పులు మెడలో వేసి.. మలం తినిపించారు?

praveen
నేటి ఆధునిక యుగంలో మనిషి ప్రతి విషయంలో కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. ప్రతి విషయంలో ఇక ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ టెక్నాలజీ యుగంలో కూడా మనిషి ఇంకా విచక్షణ రహితంగా ఆలోచిస్తున్నాడ అంటే వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే అవును అని అనిపిస్తుంది ఎంతోమందికి. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో మనిషి ఆలోచన తీరు రోజురోజుకు దారుణంగా మారిపోతుంది. వెనక ముందు ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇతరులను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.

 ఇక్కడ ఒక ఊరిలో కొంతమంది గ్రామస్తులు ఇద్దరు  యువకులు విషయంలో తప్పుడు ఆలోచన చేసి చివరికి దారుణమైన శిక్ష వేశారు. సాదరణంగా యువకులు ఎవరైనా అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డారు అంటే గ్రామస్తులు వారికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. గ్రామస్తులు కాస్త అతి చేశారు. అమ్మాయిలను వేధిస్తున్నారు అంటూ కొంతమంది యువకులపై ఆరోపణలు చేశారు.

 ఆ ఆరోపణలు నిజమ కాదా అని తేల్చకుండా దారుణంగా యువకులను శిక్షించారు. ఏకంగా మెడలో చెప్పులు వేసి ఊరంతా తిప్పడమే కాదు ఇక మనుషుల మలాన్ని తినిపించారు. మధ్యప్రదేశ్లోని శివపురిలో అవమానకర ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఇద్దరు యువకులకు స్థానికులు చితక బాదారు. అంతే కాదు మలం తినిపించారు. మెడలో చెప్పులు వేసి ఊరంతా తిప్పారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తే ఆ ఇద్దరు యువకులు.. వేధింపులకు పాల్పడలేదు అన్న విషయం తేలింది. అదంతా అసత్య ఆరోపనలని భావించిన పోలీసులు.. ఇక వారిపై దాడి చేసిన ఏడుగురిని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: