స్కూల్ మెట్లు ఎక్కుతూ కుప్పకూలింది.. వెళ్లి చూసేసరికి?

praveen
మనిషి ప్రాణాలకు గ్యారెంటీ లేదు అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకసారి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలా ప్రాణం పోతుంది  అన్నది కూడా ఊహకిందని విధంగానే ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్నవారు చూస్తూ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిలో ప్రాణభయాన్ని కలిగిస్తున్నాయి.

 మొన్నటివరకు ప్రతిరోజు వ్యాయామం చేసి పౌష్టికాహారం తీసుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటే కాస్త ఎక్కువ కాలం బ్రతికే ఛాన్స్ ఉందని అందరు అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో అభం శుభం తెలియని విద్యార్థులు సైతం ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తుండడంతో.. ఆయుష్షు పెంచుకోవడానికి ఏం చేసినా లాభం లేదు ఉన్నన్ని రోజులు సంతోషంగా బ్రతికితే చాలు అని అందరూ డిసైడ్ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే వెలుగులోకి వస్తున్న సడన్ హార్ట్ ఎటాక్ లకు సంబంధించిన మరణాలు ప్రతి ఒక్కరిని కూడా హడలిస్తున్నాయి అని చెప్పాలి.

 ఇటీవల గుజరాత్ లో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్లో 17 ఏళ్ల యువతీ స్కూలు ప్రాంగణంలోనే సడెన్ హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. నవసరి జిల్లాకు చెందిన తనీషా గాంధీ ఏబి పాఠశాలలో 12వ తరగతి చదువుతుంది. అయితే స్కూల్ బ్రేక్ సమయంలో తనిశా తన స్నేహితులతో కలిసి స్కూల్ బిల్డింగ్ మీదికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే మెట్లు ఎక్కుతుండగా విపరీతంగా చెమటలు పట్టి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పాఠశాల సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆమె మరణానికి గుండెపోటు కారణమని తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: