ఘోర రైలు ప్రమాదం.. అనాధ మృతదేహాలను రైల్వే శాఖ ఏం చేస్తుందంటే?

praveen
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది అన్న విషయం తెలిసిందే. ఈ దారుణమైన రైలు ప్రమాదంలో ఏకంగా 288 మంది 1000 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు వరకు 22 మృతదేహాలకు  పంచనామా పూర్తి చేశారు వైద్యులు. ఇంకా 86 మృతదేహాలకు పంచనామా నిర్వహించాల్సి ఉంది అని చెప్పాలి. అయితే ఆస్పత్రులలో మృతదేహాలను ఉంచేందుకు స్థలం లేకపోవడంతో స్కూలు కోల్డ్ స్టోరేజీలలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పంచనామా నిర్వహించిన తర్వాత ఇక కుటుంబ సభ్యులకు అటు మృతదేహాలను అందజేస్తున్నారు వైద్యులు. అయితే అనాధ శవాలను మాత్రం భువనేశ్వర్లోని ఎయిమ్స్ తరలిస్తున్నారు అన్నది తెలుస్తుంది. మృతదేహం ఏడు రోజులు దాటిపోతే వేగంగా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు గుర్తింపుకు నోచుకొని మృతదేహాలను రైల్వే శాఖ ఏం చేస్తుందనే ప్రశ్న అందరిలో ఉంది. ఇక ఇదే విషయంపై రైల్వే శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ మాట్లాడుతూ.. రైలు ప్రమాదాల సంభవించినప్పుడు మృతదేహాలను సంరక్షించడం అనాథ మృతదేహాలుగా ప్రకటించడం అంతిమ సంస్కారాలు చేయడం రైల్వే శాఖ పరిధిలోకి రాదని.. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అని చెప్పుకొచ్చారు.

 అనాధ మృతదేహాలను ఏం చేయాలి అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి కూడా కొన్ని నియమనిబంధనలు ఉన్నాయని.. వాటి ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.. అయితే ఇలా అనాధ మృతదేహం గుర్తించిన తర్వాత వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం అందించాలి. ఇక మృతదేహానికి సంబంధించిన రిపోర్టు తయారుచేసి మృతదేహాన్ని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం మృతదేహానికి సంబంధించిన ఫోటోలను రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లు.. ఆసుపత్రులకు పంపాలి. దీని తర్వాతనే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాల లేదా అనేది అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఎవరు మృతదేహం కోసం రాకపోయిన పక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: