చోరీకి వచ్చి పెగ్గేసాడు.. చివరికి మద్యం మత్తులో?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఇలా దొంగల బెడద నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఇంట్లో కూడా నిఘా కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ దొంగలు మరింత చాకచక్యంగా సీసీ కెమెరాలుకు దొరక్కుండా చోరీలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఇక విలువైన వస్తువులను ఎంత జాగ్రత్తగా పెట్టుకున్న దొంగలు అందిన కాడికి దోచుకుపోతున్నారు.



 అయితే ఇలా చోరీలు చేయడం విషయంలో కూడా వినూత్నమైన మార్గాలను ఎంచుకుంటూ ఉండటం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. సాధారణంగా అయితే దొంగ ఏదైనా ఇంట్లో చోరీ చేయాలి అనుకున్నప్పుడు.. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి రహస్యంగా చొరబడి.. అందరూ పడుకున్న సమయంలో.. చిన్న సౌండ్ కూడా కాకుండా అందిన కాడికి దోచుకుపోవడం చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దొంగ మాత్రం ఇలా చేయలేదు. చోరీ చేయడానికి వెళ్లిన అతను వెళ్లిన పని మర్చిపోయి ఫుల్లుగా మద్యం తాగాడు. చివరికి మద్యం మత్తులో చోరీకి వెళ్ళిన ఇంట్లోనే కాస్త కునుకు తీశాడు.



 ఇక దొంగ మద్యం తాగి నిద్రపోవడాన్ని గమనించిన ఇంటి యజమానులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన యూపీలోని లక్నోలో వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ సైనికుడు ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు ఇంట్లో నగదు బంగారాన్ని దోచుకుని వెళ్తున్న సమయంలో ఇంట్లోనే మద్యం సేవించారు. ఒక దొంగ యజమాని ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దొంగను పట్టుకుని విచారించగా ఇద్దరం కలిసి వచ్చామని.. నగలు డబ్బుతో మరో వ్యక్తిపారిపోయాడు అంటూ నిజం ఒప్పుకున్నాడు. దీంతో పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: