పోకిరి నుంచి అమ్మాయిని కాపాడాల్సిన పోలీసే.. ఇలా చేస్తే ఎలా?

praveen
సాధారణంగా పోలీసులు అంటే ఎప్పుడు నేరాలను అరికట్టడంలో నిరంతరం నిమగ్నం అయి ఉండాలి. అంతేకాకుండా ఇక ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను వేధిస్తున్నారు అంటే చాలు ఇక వారికి సరైన బుద్ధి చెప్పాలి. కానీ కొంతమంది పోలీసులు మాత్రం ఖాకి వృత్తికి తలంకాన్ని తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక మహిళలపై జరిగే వేధింపులను అరికట్టాల్సిన కొంతమంది పోలీసులు.. ఇక మహిళలను వేధిస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో కూడా ఇలాంటిదే జరిగింది. స్కూల్కు వెళ్లే బాలికను వెంబడిస్తూ ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వేధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఇక రోజు లాగానే సైకిల్ పై స్కూల్ కి వెళ్తున్న ఒక మైనర్ బాలికను పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడు. ఈ క్రమంలోనే అసభ్యంగా మాట్లాడుతూ.. వేధింపులకు గురి చేశాడు హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ షహదత్ అలీ. అయితే ముస్లిం వర్గానికి చెందిన సదరు కానిస్టేబుల్ హిందూ బాలికను రోజు వెంబడించడం ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉండేవాడు. అయితే ఓ రోజు ఒక మహిళ గమనించి ఇదంతా వీడియో తీసింది. ఏకంగా సదురు పోలీస్ కానిస్టేబుల్ను రోడ్డుపై ఆపి నిలదీసింది సదరు మహిళ. అంతేకాదు ఈ వీడియో మొత్తాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఉన్నతాధికారుల వరకు చేరింది.



 దీంతో సదర్ హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా లక్నో డిసిపి అపర్ణ కౌశిక్ తెలిపారు. ఇక సదరు కానిస్టేబుల్ పై పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డిసిపి తెలిపారు అని చెప్పాలి. అయితే ఇలా అమ్మాయిల వెంటపడే పోకిరీలకు బుద్ధి చెప్పాల్సిన పోలీస్ పోకిరిగా మారి అమ్మాయిలను వేధించడం మాత్రం దారుణం అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసిన నేటిజన్స్ పోలీస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: