పక్కింటావిడతో ముచ్చట్లు పెట్టిన భార్య.. ఊహించని పని చేసిన భర్త?
పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ దారుణంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ఈ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు బదులు మనస్పర్ధలు హత్యలు ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వచ్చిన భర్త భార్య తన కోసం వంట చేయలేదు అన్న కారణంతో కోపంతో ఊగిపోయి విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో దెబ్బలు తాళలేకపోయినా భార్య ప్రాణాలు వదిలింది. ఈ ఘటన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని ఖవర్దా జిల్లాలో వెలుగు చూసింది.
సురేష్ అనే 28 ఏళ్ల వ్యక్తి మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు. కానీ భార్య మాత్రం వంట చేయలేదు. వంట చేయకుండా పక్కింటి మహిళతో ముచ్చట్లు పెడుతూ కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు భర్త. ఒకవైపు పట్టరాని కోపం మరోవైపు ఆకలి దీంతో విచక్షణ కోల్పోయి భార్యను దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత కోపం తగ్గాక చూసేసరికి అప్పటికే భార్య ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇక భార్య ఇంద్రావతి తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.