జాతకాలు చూసి మరి.. రెండు రామచిలకలకు పెళ్లి?
సాధారణంగా అయితే ఇప్పటివరకు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం చేస్తూ ఉంటారని అందరికీ తెలుసు. ఇక ఇలా యువతి యువకులు తమకు నచ్చిన విధంగా పెళ్లి వేడుకుని జరుపుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఇక్కడ మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా రెండు రామచిలకలకు పెళ్లి చేశారు. అది కూడా ఈ రెండు రామచిలకల జాతకాలు చూసి మరి వివాహం చేయడం గమనార్హం.
సాధారణంగా అయితే రామచిలకలు అందరి జాతకాలను చూస్తూ ఉంటాయి. చిలక జ్యోతిష్యుడు ఒక పంజరంలో రామచిలుకను బంధించి ఇక దాని ముందు కార్డులు ఉంచి ఏదో ఒక కార్డు తీయమని చెప్తాడు. ఇక ఆ కార్డు తీసిన వెంటనే అందులో ఉన్న బొమ్మ ఆధారంగా ఇక రామచిలక జాతకం చెబుతుంది అన్నట్లుగా చిలుక జ్యోతిష్యుడు ఎన్నో విషయాలను చెబుతూ ఉంటాడు. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ఏకంగా రెండు రామచిలకలకే జాతకాలు చూసి మరి పెళ్లి చేశారు. పిపీరియాకు చెందిన రామ్ స్వరూప్ పెంచుకుంటున్న ఆడచిలకను బద్దలన్ లాల్ విశ్వకర్మ అనే వ్యక్తి పెంచుకుంటున్న మగచిలుకకు ఇచ్చి అతిధుల సమక్షంలో పెళ్లి చేసి బ్యాండ్ బాజాతో ఒక చిన్న కారు ఏర్పాటు చేసి ఊరేగింపు కూడా చేశారు. ఈ పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.