వరుడి ముక్కు చిన్నగా ఉందని.. వధువు ఏం చేసిందో తెలుసా?
సాధారణంగా యువతులు ఎవరైనా సరే ఇక తమ కలల రాకుమారుడు కట్టుకున్న వాడిగా వస్తే అంతకంటే ఇంకేం కావాలి అంటూ ఎంతోమంది ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక సరిగ్గా అర్థం చేసుకునే భార్య దొరికితే ఇక జీవితం మొత్తం సాఫీగా సాగిపోతుందని ఎంతో మంది యువకులు కూడా కోరుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పెళ్లి అనేది కేవలం కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. ఆడపిల్లలు అటు అబ్బాయిల బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది అని చూస్తూ ఉంటే.. ఇక అబ్బాయిలు కట్నం ఎంత వస్తుంది అన్న విషయాన్ని చూసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.
అదే సమయంలో ఇక చిన్న చిన్న కారణాల వల్ల పెళ్లిళ్లు కాస్త పెఠాకులుగా మారిపోతున్న ఘటనలో వెలుగు చూస్తున్నాయ్. ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ముక్కు చిన్నగా ఉంది అనే కారణంతో ఏకంగా వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది వధువు. ఈ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. సంభాల జిల్లాలో వరుడు ఫ్యామిలీ వధువు ఇంటికి ఊరేగింపుగా వచ్చింది. అయితే అక్కడ ఉన్న మహిళలు వరుడి ముక్కు చిన్నగా ఉంది అని అనుకుంటూ ఉండగా.. అది చివరికి వధువు చెవిలో పడింది. దీంతో అవమానంగా ఫీల్ అయిన వధువు పెళ్ళికి నిరాకరించింది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చ చెప్పిన వినకపోవడంతో విషయం పోలీసుల వరకు వెళ్ళింది అని చెప్పాలి. ఇక పోలీసులు సైతం నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో వరుడు కుటుంబ సభ్యులు ఇంటి బాట పట్టారు.