పిల్లలు కావట్లేదని.. క్షుద్ర పూజలు చేసింది.. చివరికి?
ఇలా నేటి టెక్నాలజీ యుగంలో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని గుడ్డిగా నమ్ముతూ చివరికి ఎంతోమంది బురిడీ బాబాల చేతిలో మోసపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏళ్ళు గడుస్తున్న ఆమెకు పిల్లలు కాలేదు. దీంతో అమ్మ అని పిలిపించుకోవాలనె ఆశ ఆమెను గుడ్డి నమ్మకాల వైపు నడిపించింది. తన బాధ మరో మహిళకు చెప్పుకుంది. దీంతో తాంత్రికూడు పూజలు చేస్తే పిల్లలు పుడతారని ఆమె ఒక చెత్త సలహా ఇచ్చింది.
ఎలాగైతేనేం తల్లి కావాలని ఆశ నెరవేరితే చాలు అని భావించింది సదరు బాధితురాలు. ఈ క్రమంలోనే మరో మహిళ చెప్పిన సలహాను వెనుక ముందు ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అయింది. ఈ క్రమంలోనే సదరు మహిళ చెప్పిన భర్తను ఒప్పించి తాంత్రికూడిని సంప్రదించింది. పూజలకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పిన తాంత్రికడు ఓ రోజు ఇంట్లో పూజలు చేస్తూ దంపతులను ఇంటి బయటకి పంపించాడు. ఇక మూడు గంటల తర్వాత ఇంట్లోకి వచ్చి చూడగా తాంత్రికుడు తో పాటు డబ్బులు కూడా మాయమయ్యాయి. దీంతో పోలీసులను ఆశ్రయించింది ఈ జంట. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో వెలుగు చూసింది.