జరిమానా వేసిన పోలీసులకు.. ఊహించని షాక్ ఇచ్చాడు?

praveen
ఇటీవల కాలంలో పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా రోడ్డు నిబంధనలు పాటించకపోతే వారికి జరిమానాలు విధించడం కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అందరికీ జరిమానాలు వేసినట్లు గానే ఇక్కడ ఒక వ్యక్తికి పోలీసులు జరిమానా వేశారు. హెల్మెట్ ధరించనందుకు గాను ఏకంగా ఆరు వేల రూపాయలు ఫైన్ వేశారు. ఈ క్రమంలోనే అతనికి పట్టరాని కోపం వచ్చింది. కానీ  పోలీసులను ఏమీ అనలేడు కదా.  అందుకే అతను కూడా సైలెంట్ గా ఉన్నాడు. కాని ఆ తర్వాత మాత్రమే పోలీస్ లకే చుక్కలు చూపించాడు.

 ఇంతకీ ఏం చేసాడో తెలుసా పోలీస్ స్టేట్మెంట్ ను అంధకారం లోకి నెట్టేశాడు. పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన విద్యుత్ లైన్ కట్ చేశాడు   ఇక ఈ ఘటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  నిబంధనలు పాటించనప్పుడు పోలీసుల తమ పవర్ చూపిస్తే..  ఆ తర్వాత మాత్రమే లైన్ మెన్ గా పనిచేస్తున్న సదరు వ్యక్తి తన పవర్ ఏంటో చూపించాడు. ఉత్తరప్రదేశ్ లోని ఈశాన్య ప్రాంతానికి చెందిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్మెన్ జాబ్ చేస్తున్నాడు సదరు వ్యక్తి.

 ఈ క్రమంలోనే ఏదో పని నిమిత్తం ద్విచక్ర వాహనం  మీద బయటికి వెళ్లాడు. అడ్డుకున్న పోలీసులు హెల్మెట్ ధరించి లేదు అన్న కారణంతో  ఏకంగా ఆరు వేలు జరిమానా వేశారు. 6000 జరిమానా వేయడంతో తీవ్ర  ఆగ్రహానికి లోనయ్యాడు సదరు వ్యక్తి. కానీ అధికారులను మాత్రం ఏమీ అనలేకపోయాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు 56 వేల పెండింగ్ కరెంటు బిల్లు ఉంది అన్న కారణంగా పవర్ కట్ చేసాడు. దీంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు అని చెప్పాలి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: