భర్త అలా చేశాడని.. అవమానం తట్టుకోలేక భార్య సూసైడ్?

frame భర్త అలా చేశాడని.. అవమానం తట్టుకోలేక భార్య సూసైడ్?

praveen
మోసం అనేది మనిషి నైజం అని అంటూ ఉంటారు ఎంతోమంది. అయితే ఒకప్పుడు జనాలు ఈ విషయాన్ని అసలు నమ్మేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది నిజంగానే మనిషి మోసానికి కేరాఫ్ గా మారిపోయాడు అన్నది బలంగా నమ్ముతున్నారు. దీనికి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. ఏకంగా పరాయి వ్యక్తులను బురిడీ కొట్టించి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు దండుకుని జల్సాలు చేయడానికి నేటి రోజుల్లో ఇష్టపడుతున్నారు కేటుగాళ్లు. ఎంతోమంది మోసగాళ్ల మాయలో పడి డబ్బులు కోల్పోతున్న బాధితులు  లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.



 సాధారణంగా మధ్యతరగతి ప్రజలు డబ్బులు కూడపెట్టుకోవడానికి చిట్టిల వ్యాపారి దగ్గర ప్రతి నెలా ఒక చిట్టీ వేయడం చేస్తూ ఉంటారు. తద్వారా వచ్చిన దానిలో కొంతైనా పిల్లల కోసం వెనకేసుకున్నాము అనే సంతృప్తి పొందుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొంతమందికి మాత్రం చిట్టీల వ్యాపారం పేరుతో ఎంతోమందిని బురిడీ కొట్టించి చివరికి ప్లేట్ ఫిరాయించటం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇక్కడ ఇలాంటిదే జరిగింది. చిట్టి వ్యాపారం పేరుతో డబ్బులతో పరారయ్యాడు భర్త.. అయితే ఈ అవమానాన్ని తట్టుకోలేక పోయిన భార్య చివరికి ఆత్మహత్యకు పాల్పడింది.


 గుంటూరు జిల్లా మంగళగిరి మండలం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చిట్టి వ్యాపారం నడిపించేవాడు. అయితే గ్రామస్తుల నుంచి చిట్టి ల రూపంలో 50 కోట్ల వరకు వసూలు చేశాడు.  ఎవరికీ తెలియకుండా ఇంటి దగ్గర నుంచి పరారయ్యాడు. ఇప్పటివరకు ఆచూకీ లేదు. అయితే  ఇటీవల ఇంటికి వచ్చిన వెంకటేశ్వరరావును బాధితులు నిలదీశారు.  గత కొన్ని రోజుల నుంచి ఇదే వాగ్వాదం నడుస్తుంది. ఇలాంటి సమయంలోనే ఏకంగా బాధితులు వెంకటేశ్వరరావు కుమారుడుని కూడా కిడ్నాప్ చేయడం గమనార్హం.  దీంతో ఎంతగానో మనస్తాపం చెందిన వెంకటేశ్వరరావు భార్య సమీపంలో ఉన్న బావిలో దూకి చివరికి శవమై తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: