కోతులను చూసి భయపడి.. బాలుడు చేసిన పనికి ప్రాణం పోయింది?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది.. ఈ క్రమంలోనే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో క్షణ కాల వ్యవధిలోనే ఎంతో మంది మృత్యుఒడిలో కి వెళ్ళి పోతూ ఉంటారు. వెరసి ఎన్నో కుటుంబాలకి  విషాదం నిండి పోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూసిన తర్వాత నిజంగా మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిదే అని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉన్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి.. అతను పుట్టుకతోనే మూగ అయినప్పటికీ అతని లోపాన్ని పట్టించుకోకుండా అందరితో ఎంతో సరదాగానే ఉండేవాడు. అయినప్పటికీ అతన్ని చూసి ఓర్వ లేక పోయింది విధి. ఊహించని రీతిలో అతని మృత్యుఒడిలోకి పంపించింది. దీంతో కొడుకే లోకంగా బ్రతుకుతున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.  ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నర్సాపూర్ పట్టణంలో నిర్మాణ భవనంపై నుంచి మూగ బాలుడు మణికంఠ కింద పడి చివరికి ప్రాణాలు వదిలాడు.


 అయితే కోతుల కారణం గానే ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. అయితే కోతులకు  భయపడి చివరికి చూసుకోకుండా భవనం పై నుంచి కాలు జారి కింద పడ్డాడు.  ఈ క్రమం లోనే తీవ్ర గాయాలు  అయ్యాయి. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలాడు మణికంట.  అయితే కూలి పనులు చేసుకునే తల్లి యశోద ఇటీవల తనతో పాటు తన కొడుకు మణికంఠను కూడా తీసుకెళ్ళింది. అక్కడ కోతులు కనిపించడం తో భయం తో కాలుజారి భవనం పైనుంచి కింద పడ్డాడు. అయితే ఏడాది క్రితమే మణికంఠ తండ్రి కూడా చని పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: