పసివాడి ప్రాణంతో సైబర్ నేరగాళ్ల చెలగాటం.. ఏం చేశారో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు ఎంతలా రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమాయకులని టార్గెట్గా చేసుకుంటూ చివరికి దారుణంగా నేరాలకు  పాల్పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బాధితులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తూ న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నారు. ఇక్కడ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒక చిన్నారి విషయంలో కాస్త అయినా జాలి చూపించలేకపోయారు. వ్యాధితో బాధపడుతున్న కూడా కేటుగాళ్లు దయ చూపలేదు. తమ కూతురిని బతికించుకోవడం కోసం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అమాయకపు తల్లిదండ్రులను ఆసరాగా చేసుకొని చివరికి మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు.

 ఆదుకుంటామని చెప్పి చివరికి ఉన్నదంతా ఊడ్చేశారు. ఈ దారుణమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పట్టణాల్లోనే కాదు పల్లెవాసులను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు అన్నదానికి ఈ ఘటన నిదర్శనం గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం లోని అనిశెట్టిపల్లి  గ్రామానికి చెందిన మేఘనాథ్ దంపతులకు  4 నెలల బాబు ఉన్నాడు. లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. ఇక తమ బిడ్డను కాపాడుకోవాలి అని ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఇక అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్  చేస్తేనే పిల్లాడు  బతికే ఛాన్స్ ఉందని 18 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.

 దీంతో తల్లిదండ్రులు గుండె బద్దలయినంత  పని అయ్యింది. అంత ఖర్చు చేసి కొడుకును బ్రతికించు కొనేంత స్తోమత వారి దగ్గర లేదు. ఈ క్రమంలోనే  దాతల సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా మార్చుకున్నారు. బాధితుల ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి  తాము సోనుసూద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాము..  అకౌంట్ లో పైసలు వేస్తామని చెప్పి తమ ఫోన్ కి యాప్ లింక్ చేసి అందులో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. ఇక బాధితులు నమ్మి ఇలాగే చేశారు. చివరికి దాతల నుంచి డబ్బులు రావడం కాదు అకౌంట్లో ఉన్న 14000 కూడా ఊడ్చేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: