భార్యపై అనుచిత వ్యాఖ్యలు.. ఆ పోలీస్ ఏం చేసాడో తెలుసా?
ఇలా సహోద్యోగుల తుపాకితో కాల్చి చంపిన సదరు వ్యక్తి చివరికి పోలీస్ స్టేషన్ లో వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. సిక్కిం పోలీస్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రబీన్ అనే వ్యక్తి ఇటీవలే కాల్పులు జరుపగా.. మృతి చెందిన అధికారులు కూడా అతనితో పాటే రిజర్వు బెటాలియన్ లో పనిచేస్తున్నారు. ఇండియన్ రిజర్వు బెటాలియన్ లో భాగమైన వీరు ఢిల్లీలోని హైదర్ పూర్ లో వాటర్ ప్లాంట్ వద్ద విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కాగా ఇటీవల మధ్యాహ్నం కేఎస్ కె మార్గ్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది.
ఈ క్రమం లోనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే కాల్పులకు గురైన పోలీసులు ఇతర సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు అని తెలుస్తుంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో అధికారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించాలని పరిశీలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే తన భార్య గురించి తోటి ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేశారని నిందితుడు ప్రాథమిక విచారణలో చెప్పడం గమనార్హం. తద్వారా మానసిక వేధింపులకు గురి చేయడం కారణంగా కాల్పులు జరిపినట్లు ఒప్పుకున్నారు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.