11 రోజులుగా.. పోలీస్ రిమాండ్లో కుక్క.. ఇంతకీ ఏం చేసిందంటే?
అదేంటి అందరు పోలీసులలాగే ఇక్కడ కూడా పోలీసులు నిందితున్ని పట్టుకొని రిమాండ్కు తరలించారు అందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా.. సాధారణంగా ఇప్పటివరకు మనుషులను నేరస్థులుగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కుక్కను 11 రోజులుగా పోలీసులు రిమాండ్లో ఉంచడం గమనార్హం. ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. బీహార్ లో మద్యం అక్రమ రవాణా కేసులో ఓ జర్మన్ షఫర్డ్ శునకం 11 రోజులుగా పోలీసులు రిమాండ్ లో ఉంది. జులై 6వ తేదీన బాక్సర్ జిల్లాలోని ఘాజీపూర్ వద్ద శునకం పట్టుబడటం గమనార్హం.
కాగా రాష్ట్ర సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో ఒక కారులో విదేశీ మద్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇక తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో పాటు ఉన్న జర్మన్ షెఫర్డ్ కుక్కను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఏం ఆలోచించి కుక్క ను అదుపులోకి తీసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు అదే వారికి పెద్ద తలనొప్పిగా మారింది. కుక్క రోజు వారి ఖర్చులు ప్రస్తుతం భారీగానే ఉన్నాయి. స్టేషన్ సిబ్బంది తలా కొంత చందాలు వేసుకుని ఆహారం పెడుతున్నారు. ఆహారం ఏ మాత్రం తగ్గిన గట్టిగా మురికి అందరినీ ఇబ్బంది మొరిగి ఇబ్బంది పెడుతుంది ఆ కుక్క. దీంతో కుక్కను తీసుకువెళ్లాలని యజమానిని పోలీసులు వేడుకుంటూ ఉండటం గమనార్హం.