ఏడడుగులు వేయాల్సిన యువతి.. రెండు అడుగులు వేసి ట్విస్ట్ ఇచ్చింది?
ఇంతకీ ఒకప్పుడు సినిమాల్లో ఏం జరిగిందంటే.. పెళ్లి మండపం పై వధువు వరుడు ఉండేవారు. ఇకబాజా భజంత్రీల మధ్య పెళ్లితంతు జరుగుతూ ఉండేది. బంధుమిత్రులు అందరూ కూడా పెళ్లి మండపంలో కనిపిస్తారు. సరిగ్గా తాళికట్టే సమయానికి ఆపండి అంటూ ఒక డైలాగ్ వినిపిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అంతేకాదు ఆ తర్వాత ఏదో ఒక కారణంతో పెళ్లి ఆగిపోతుంది. లేదా సరిగ్గా తాళికట్టే సమయానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ వధువు ట్విస్ట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఇక్కడ మాత్రమే కాదు ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
పెళ్లికి ఏడు అడుగులు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఏడు అడుగులు వేస్తున్న సమయంలో రెండు అడుగులు వేసిన యువతి తనకు పెళ్లి ఇష్టం లేదు అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన నీతా, రవి యాదవ్ కు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పెళ్ళి తంతు ప్రారంభం అయింది. వధూవరులు పూలదండలు మార్చుకున్నారు. అగ్ని గుండం చుట్టూ సాంప్రదాయం ప్రకారం ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. రెండు అడుగులు వేసిన వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ. ఇక వెంటనే స్పందించిన వరుడు తమ నగలు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.