అయ్యో కొడుకా.. ఎంతపని జరిగిపాయె?

praveen
రైతుల పరిస్థితి ఎప్పుడూ దుర్భరంగా మారిపోతూ ఉంటుంది. ఒకవైపు ప్రభుత్వం మరో వైపు దళారులు అటు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఇంకో వైపు ప్రకృతి కూడా అటు రైతులపై పగబట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది.  నలుగురికి అన్నం పెట్టాలని ఉద్దేశంతో చెమటోడ్చి ఆరుగాలం కష్టపడ్డ రైతుకు నిరాశే మిగులుతోంది. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి రైతుకు అసలు ఇబ్బందులు మొదలవుతాయి. ప్రభుత్వం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో లేదో అనే భయం.

 దళారుల చేతిలో మోసపోవాల్సి వస్తుందేమో అనే ఆందోళన ఇక వీటన్నిటి మధ్య ప్రకృతి కూడా పగబట్టినట్లు వ్యవహరిస్తుంది. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయేలా చేస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని యాసంగి వరి పంట సాగు చేశాడు ఆ రైతు. ఇక ఇటీవలే వరి కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. ఇక వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో కుమారుడితో కలిసి ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్ళాడు.

 అంతలోనే విధి పగబట్టినట్లుగా వ్యవహరించింది. ఏకంగా దాన్యం కుప్ప వద్దకు వెళ్లగా కుమారుడిపై  పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు సదురు యువకుడు. ఇక కళ్ళముందే కుమారుడు చనిపోవడం చూసి ఒక్కసారిగా ఆ తండ్రి గుండె ఆగినంత పని అయిపోయింది. దీంతో కొడుకుని చేతుల్లో పట్టుకుని బోరున విలపించాడు.  ఈ ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు లో వెలుగులోకి వచ్చింది. ఏసురత్నం అనురాధ దంపతులకు ముగ్గురు సంతానం వారిలో విద్యాసాగర్ పెద్దవాడు. అయితే తండ్రికి చేదోడు వాదోడుగా ఉండే విద్యాసాగర్ ఇటీవలే దాన్యం కుప్ప వద్దకు వెళ్లగా ఒక్కసారిగా పిడుగు పడి మృతి చెందాడు. దీంతో ఈ ఘటనతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: