వెరైటీ దొంగలు.. ఏం చోరీ చేస్తారో తెలుసా?
ఇటీవలి కాలం లో కంప్యూటర్ యుగం నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మంది కంప్యూటర్లు, లాప్ టాప్ లు లాంటివి యూస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిలోని హార్డ్వేర్ లకు డిమాండ్ ఎక్కువ. అందుకే వాటిని దొంగలించడం పనిగా పెట్టుకుంది ఇక్కడో ముఠా. గుట్టు చప్పుడు కాకుం డా ఈ వెరైటీ దొంగతనాలు చేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు తిరుపతి జిల్లా లో చాలానే ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రతి కళాశాలలో కంప్యూటర్ ట్రైనింగ్ తప్పనిసరిగా మారింది. ఇక దాదాపు వందలకుపైగా కంప్యూటర్లు కళాశాలలో ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమం లోనే కళాశాలలనే టార్గెట్ గా చేసుకుంటూ హార్డ్ వేర్ లను దొంగలిస్తూ వచ్చారు. 2010 నుంచి జిల్లాలోని 50 కళాశాల లో దొంగల ముఠా కంప్యూటర్ ఉపకరణాలను దొంగలించినట్లు పోలీసులు విచారణ లో వెల్లడైంది. ఈ ఉపకరణాలను చెన్నై లోని బర్మా మార్కెట్ కేంద్రంగా అమ్మకాలు జరిపి.. 20 లక్షలకు పైగా సంపాదించినట్లు పోలీసుల విచారణ లో తేలింది. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన మురళి, శేఖర్ కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి,వెంకట్, పుల్లెల గోపీ లు ప్రధాన నిందితులుగా ఉన్నారని పోలీసులు తేల్చి చెప్పారు..