దారుణం..13 ఏళ్ల బాలికపై 80 మంది అత్యాచారం..
తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చాయి.ఓ 13 ఏళ్ల బాలికపై 80 మంది అత్యాచారం చేశారు. ఈ ఘటన మరెక్కడో జరగలేదు. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే.. గత ఏడాది జూన్ మాసం భాలిక తల్లి కరోనాతో ఆసుపత్రిలో చేరింది.అప్పుడు మరో మహిళ కూడా అదే ఆసుపత్రిలో చేరింది.. బాలిక పోషణకు కష్టంగా ఉందని చెబితే, తాను బాలికను దత్తత తీసుకుంటానని చెప్పింది.ఆగస్టులో చిన్నారి తల్లి చనిపోయాక.. తండ్రికి చెప్పకుండానే బాలికను సవర్ణ తీసుకెళ్లిపోయింది. చిన్నారి కనపడకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..
అప్పటి నుంచి పోలీసులు బాలిక ఆచూకీ కోసం అనుమానం వచ్చిన చోట వెతుకుతున్నారు.ఈ క్రమంలో మంగళవారం గుంటూరులోని బ్రోతల్ హౌస్ నుంచి చిన్నారిని కాపాడారు గుంటూరు వెస్ట్ జోన్ పోలీసులు. ప్రధాన నిందితురాలు సవర్ణ కుమారినీ అదుపులోకి తీసుకున్నారు. నిన్న బీటెక్ విద్యార్థితో సహా మరో 10 మందిని అరెస్టు చేశారు..ఈ మేరకు బాలిక చెప్పిన విషయాలను విని విస్తూ పోయారు.. బాలికను ఏపీ, తెలంగాణాలోని బ్రోతల్ హౌస్ లకు పంపి వ్యభిచారం చేయించినట్లు చెప్పింది.మొత్తంగా 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడల్లో అదుపులోకి తీసుకుని,వారి దగ్గర నుంచి 53 సెల్ ఫోన్లు, మూడు ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నారు.. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు !గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.