
చేతబడి చేస్తుందని.. వివస్త్రను చేసి ఊరంతా?
ఇంకా ఆధునిక యుగానికి దూరం గా అనాగరికతకు దగ్గరగా ఎన్నో మూఢ నమ్మకాలను నమ్ముతూ ఇక నేటి రోజుల్లో కూడా దారుణం గా ప్రవర్తిస్తున్న మనుషులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఇటీవలికాలంలో మంత్రాల నెపంతో ఎంతో మంది పై దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా కొంతమంది మంత్రాల నెపంతో హత్యలు సైతం చేస్తున్న ఘటనలు కూడా అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
మంత్రాలు వచ్చని.. క్షుద్రపూజలు చేస్తుంది అనే నెపంతో ఒక మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు కొంత మంది జనాలు. ఏకంగా మహిళను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. అయితే గ్రామస్తులందరూ చూస్తూ ఉండిపోయారు గానీ ఎవరూ ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్ర లోని నందుర్బార్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తూ ఉండటం గమనార్హం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.