
వీడు డాక్టర్ కాదు నీచుడు.. చికిత్స కోసం వెళ్లిన 48 మంది మహిళలపై?
మహిళలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చిన.. ఇక మహిళల పై అత్యాచారాలు చేసిన వారిని ఎన్కౌంటర్ చేసి చంపిన కూడా ఎక్కడా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. రోజురోజుకీ ఆడపిల్లల జీవితం మాత్రం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. కేవలం మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్న దానికి వెలుగులోకి వస్తున్న ఘటన లే నిదర్శనంగా మారిపోతున్నాయి అన్నది తెలుస్తుంది. ఇలా ఇటీవల కాలంలో రోజురోజుకీ మహిళల భద్రతా ప్రశ్నార్థకంగా మారిపోతోంది.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా డాక్టర్ అన్న తర్వాత తన వద్దకు వచ్చిన పేషెంట్లకు చికిత్స అందించాలి. కానీ ఇక్కడ మాత్రం కామం తో ఊగిపోయాడు తన దగ్గరికి చికిత్స కోసం వచ్చిన మహిళలపై అత్యాచారానికి పాల్పడటం మొదలుపెట్టాడు. 72 ఏళ్ల డాక్టర్ కృష్ణ సింగ్ బ్రిటన్లో చాలా ఏళ్లుగా పని చేస్తూ ఉన్నాడు. ఆ డాక్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ 2018 లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే 1993 ఫిబ్రవరి నుంచి 2018 వరకు కూడా తన వద్దకు చికిత్స కోసం వచ్చిన మొత్తం 42 మంది మహిళలపై కృష్ణ సింగ్ లైంగిక దాడులకు పాల్పడినట్లు ఇక విచారణలో తేలింది. ప్రస్తుతం అతని కోర్టులో హాజరు పరిచారు..