మద్యం వద్దన్న డాక్టర్.. కళ్లముందే ప్రాణం తీసుకున్న పేషెంట్?

praveen
ఇటీవలికాలంలో మద్యానికి బానిసగా మారిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎంతోమంది మద్యం మత్తులోనే తూలుతు ఉన్నారు. కొంతమందికి అయితే మద్యం అనేది ఒక ఔషధంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకరోజు మందులు వేసుకోకపోతే  ప్రాణం పోతుంది అన్నట్లుగా ఒక్క రోజు మద్యం తాగకుండా ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్న విధంగానే ఎంతోమంది పిచ్చెక్కి పోతుంటారు. ఒక పెగ్గు లోపల పడిన తర్వాతనే సాధారణ మనుషుల్లా ప్రవర్తించడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.


 అయితే మద్యం తాగడం అలవాటు ఎక్కువైనప్పుడు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే మద్యానికి దూరంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఇలా వైద్యులు మద్యానికి దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ మొత్తానికి మద్యానికి దూరంగా ఉండకుండా కాస్త తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. కొంతమంది కాస్త కష్టం అయినా సరే మద్యం అలవాటును మానేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం చేయకూడని పని చేశాడు. మద్యం మానేయాలి అని చెప్పినందుకు డాక్టర్ కి షాక్ ఇచ్చాడు. కళ్ళముందే ప్రాణాలు తీసుకున్నాడు.


 ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పేషెంట్ కు మందు తాగొద్దు అన్నందుకు హాస్పిటల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. బాలాపూర్ కు చెందిన నాగరాజు ఈ నెల రెండవ తేదీన పురుగుల మందు తాగాడు చికిత్స నిమిత్తం భార్య ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకు వచ్చింది. అయితే మద్యానికి బానిసైన అతను మద్యం కావాలని  భార్యను కోరాడు.అయితే ఇక అతని తీరు అర్థం చేసుకున్నా వైద్యులు మద్యం తాగకూడదు అంటూ చెప్పారు. దీంతో మనస్థాపంతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: