పెన్నులు బుక్ కొనిస్తానన్నాడు.. కానీ చివరికి?

praveen
మీరు మంచి వారేనా.. ఈ ప్రశ్న దేశంలో ఎవరిని అడిగినా సరే.. మీరు మమ్మల్ని అలా అడగాలా  నాకు తెలిసి ఈ దేశంలోనే మా కంటే మంచి వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని చెబుతున్నారు చాలామంది. మరి ఇంత మంచి వాళ్లు ఉన్నప్పుడు నేటి రోజుల్లో అత్యాచార ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మాత్రం అర్థం కాని పరిస్థితి. నేటి సభ్య సమాజంలో మంచి వాళ్ళ ముసుగులో ఎంతోమంది సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి.. వావివరుసలు మరిచిపోయి ఇక వయసుతో సంబంధం లేకుండా కామంతో మానవమృగాలు గా మారిపోతున్న మనుషులు ఆడది కనిపిస్తే చాలు దారుణంగా పశువుల్లా మీద పడి కామ వాంఛలను తీర్చుకుంటున్నారు.

 ఇక అభం శుభం తెలియని చిన్నారులు కూడా కామపు చూపు లతో చూస్తూ చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేస్తూ ఉన్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. బాలిక పై కన్నేసిన ఓ కామాంధుడు పెన్నులు బుక్స్ కొనిస్తాను అంటూ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను పెన్నులు పుస్తకాలు కొని ఇస్తానని గౌడ్ అనే వ్యక్తి నమ్మించాడు. ఈ క్రమంలోనే మాయమాటలు చెప్పి ఒక పాడుబడ్డ పాత బంగ్లా లోకి తీసుకు వెళ్ళాడు.

 ఆ తర్వాత ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అయితే బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నాడు.  స్థానికులు వస్తున్నారు అన్న విషయాన్ని గమనించిన సదరు కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన స్థానికులు గౌస్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారం అందించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన గౌస్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటన కాస్త ఇక ఆడ పిల్లల తల్లిదండ్రులు అందరిలో కూడా మరింత భయాందోళనలు పెంచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: