ఉద్యోగం రాలేదని.. ఆ పని చేసాడు?

praveen
ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివిన ఉద్యోగం వస్తుంది అన్న గ్యారెంటీ  లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నేటి రోజుల్లో పెద్ద చదువులు చదువుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతూ ఉండడం అదే సమయంలో అటు ఉద్యోగాల సంఖ్య మాత్రం తక్కువ అవుతూ ఉండడం జరుగుతూ ఉంది. దీంతో ఇక ఏ ఇంటర్వ్యూలకు వెళ్లినా ఉద్యోగం రాక ఎంతో మంది యువత నిరాశ పడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే ఇలా ఉద్యోగం రాక పోవడమే ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది నేటి రోజుల్లో. ఎందుకంటే మంచి చదువులు చదివి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని ఆశపడిన ఎంతోమందికి ఇక ఎన్నో ఇంటర్వ్యూలలో నిరాశే ఎదురవుతుంది.


 కాళ్లరిగేలా ఇంటర్వ్యూలకు తిరిగి తిరిగి చివరికి నిరాశ పడిన ఎంతో మంది యువత ఇక ఉద్యోగం రాని జీవితం వృథా అని భావిస్తూ ఉన్నారు. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగం రానప్పుడు ఇక బ్రతకడం ఎందుకు అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతో మంది తల్లిదండ్రులు ఇక అరణ్యరోదనగా విలపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఉద్యోగం రాలేదని మనస్థాపంతో యువకుడు కఠిన నిర్ణయం తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాండురంగాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు శివ రాణి దంపతులకు అజయ్ అనే కుమారుడు ఉన్నాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశాడు అజయ్. గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎన్నో ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసినప్పటికీ అతనికి నిరాశ ఎదురైంది. దీంతో ఎంతగానో మనస్తాపం చెందాడు అజయ్. గత నెల 20వ తేదీన పంటచేను కు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలోనే గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: