భార్య మందలించిందని.. ఇదేం పని?

praveen
అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాకి పిల్ల కవితకు కాదేది అనర్హం అన్నారు ఒక మహానుభావుడు.. అయితే ఇక ఇప్పుడు దీనిని అటు మనుషులు తప్పుగా అర్థం చేసుకున్నారు అని తెలుస్తోంది. ఆత్మహత్యకు కాదేది అనర్హం అన్న విధంగానే వ్యవహరిస్తున్నారు నేటి రోజుల్లో మనుషులు. ఎందుకంటే నేటి  రోజుల్లో ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తే ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. ఎందుకంటే అంత చిన్న కారణాలకు నేటి రోజుల్లో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇలా ఆత్మహత్యలు వెనుక ఉన్న కారణాలను తెలిసిన తర్వాత ఇంత చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసుకుంటారా అని అందరూ అవాక్కవుతున్న  పరిస్థితి ఏర్పడింది నెలరోజుల్లో. చిన్న చిన్న కారణాలకు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు చాలామంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉండటం గమనార్హం. కానీ ఆ చిన్నపాటి గొడవలతో ఎంతోమంది మనస్థాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు . ఇక్కడ సరుకుల కోసం భార్య ఇచ్చిన డబ్బుతో మద్యం తాగాడు భర్త దీంతో భార్య మందలించింది.


 పాపం మద్యం మత్తులో ఉన్న అతని మనసు గాయపడింది. ఇంకేముంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరికీ వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్  పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సురేష్ సరితా దంపతులు హర్షగూడ లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కుటుంబం. ఇటీవలే దాచుకున్న కొంత డబ్బుతో నిత్యావసర సరుకులు తీసుకు రావాలని భర్తకు ఇచ్చింది భార్య సరిత. కానీ భర్త మాత్రం నేరుగా వైన్ షాప్ కి వెళ్లి మద్యం తాగాడు. దీంతో ఇక భార్య కోపం వచ్చి మందలించింది. ఇక మనస్థాపం చెందిన భర్త మద్యం మత్తులోనే  ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: