ప్రేమ పెళ్లి.. కానీ రెండు రోజులకే?
రెండేళ్ల పాటు ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అని నిర్ణయించుకున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేశారు. కాని పెద్దలు మాత్రం వారికి పెళ్లి చేసేందుకు ససేమిరా అన్నారు. చివరికి పెద్దలను ఎదిరించి పోలీసుల సహాయంతో ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. కానీ చివరికి పెద్దలు వచ్చి విడదీశారు. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. అభిషేక్ చోళనహళ్ళికి చెందిన అనన్య ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుని వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా పెద్దలు మాత్రం వ్యతిరేకించారు. మేజర్లు కావడంతో పోలీసులను సంప్రదించి ఒక గుడిలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఇక ఈ కొత్త జంట ఒక కేఫ్ ఉన్న సమయంలో అనన్య తల్లిదండ్రులు బంధువులు ఇక ఈ జంట పై దాడి చేసి దారుణంగా కొట్టారు. అనన్యను బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇద్దరూ మేజర్లు కావడంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునేందుకు అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక అనన్య తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇక వారి అంగీకారంతోనే ఈ ప్రేమ జంటను కలపాలని పోలీసులు భావిస్తూ ఉండడం గమనార్హం..