మరో ప్రాణం భలి.. కారణం అదే?
ఇక ఇలా నాటు సారా బట్టీలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ఎంతోమంది నాటుసారాకు అలవాటు పడి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పోలీసులు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులు కళ్ళు కప్పి రహస్యంగా నాటుసారా బట్టీలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది ఇటీవలే నాటుసారా కారణంగా ఎంతో మంది చనిపోయిన ఘటన సంచలనం గా మారిపోయాయ్. ఈ ఘటన గురించి మరవకముందే నాటుసారా కు మరో ప్రాణం బలి అయ్యింది.
నాటు సారా తాగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కల్తీ సారా తాగడం వల్ల మరణించాడని బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గడివేముల మండలం కే బొల్లవరం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు రెండు రోజుల నుంచి అధికంగా నాటుసారా తాగుతున్నట్లు బంధువులు తెలిపారు. అయితే ఇటీవలే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు సుబ్బరాయుడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతనికి నీరు తాగించే ప్రయత్నం చేశారు. ఇలా నీరు తాగిన కొద్ది సేపటికే సుబ్బారాయుడు మృతి చెందినట్లు భార్య అంకాలమ్మ తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.