భర్త బాత్రూంలో నీళ్లు పోయలేదని.. ఉరి వేసుకున్న భార్య?

praveen
భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరగడం సర్వసాధారణం. ఇక ఇలా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నప్పుడే వారి బంధం మరింత బలపడుతుంది అని అంటూ ఉంటారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది అని చెబుతూ ఉంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే దాంపత్య బంధం కాస్త సరదాగా సాగిపోతుంది అని అంటూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం దాంపత్య బంధంలో చిన్న విషయంలో తలెత్తిన వివాదం  ఏకంగా దారుణాలకు కారణం అవుతూ వుండడం చూస్తూ వుంటాము. చిన్నచిన్న గొడవలలో మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య నేటి రోజుల్లో పెరిగిపోతూనే ఉంది.


 అంతేకాకుండా రోజు రోజుకి ఇలా చిన్నపాటి గొడవలు కారణంగా ఇక విడిపోతున్న గంటలు కూడా ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. సర్దుకుపోతూ దాంపత్య జీవితాన్ని నిలబెట్టుకోవడం మానేసి ఈగోలకు పోతు చివరికి చేజేతులారా దాంపత్య జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. బాత్రూం శుభ్రం చేయడం విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం మహిళ  బలవన్మరణానికి పాల్పడేందుకు దారితీసింది. కూకట్పల్లిలో ఇక ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ బాలాజీ నగర్ లో దాసరి శృతి, నవీన్ దంపతులు నివసిస్తున్నారు.



 ఈ దంపతులు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. ఇక వీరికి ఆరేళ్లు, ఏడాదిన్నర వయస్సున్న ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే శృతి  ఇంట్లోనే ఉంటూ పనులు చూసుకుంటూ ఉండగా.. నవీన్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. మంగళవారం మధ్యాహ్నం నవీన్ బాత్రూం లో మూత్ర విసర్జన చేసి వచ్చాడు. అయితే నీళ్లు ఎందుకు పోయలేదు అన్న విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. ఇక ఈ గొడవ పెద్ద వివాదంగా మారి పోయింది.. ఇద్దరూ మాట మాట అనుకున్నారు. ఈ క్రమంలోనే అవమానంగా భావించిన శృతి గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకొని మరణించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: