మంచం పట్టిన తాత పై అత్యాచార ఆరోపణలు.. చివరికి?
ఢిల్లీలోని గురుగ్రాం పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లాల్ సింగ్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అది కూడా ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు అంటూ కేసు నమోదయింది. ఇక బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయడం మొదలుపెట్టారు. అయితే అలాంటి ఆరోపణలు రావడంతో ఆ వృద్ధుడు ఎంతగానో కలత చెందాడు. నాపై అత్యాచార ఆరోపణలు రావడం ఏంటి అంటూ కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా రోజంతా ఏడుస్తూనే ఉండిపోయాడు. చివరికి ఇక అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తే పరువు పోతుందని భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. కేసు నమోదయిందని బాధతో లాల్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మొదటి నుండి లాల్ సింగ్ పై ఫిర్యాదు చేసిన బాలిక తల్లిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. లాల్సింగ్ తన కూతురుపై కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని బయటకు చెబితే చంపేస్తానని బెదిరిస్తూ ఉన్నాడు అంటూ పోలీసులు తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా లాల్ సింగ్ ఆరోగ్యం బాగాలేక కూతురు దగ్గరే ఉంటున్నాడు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇక బాలిక తల్లిని గట్టిగా నిలదీయడంతో గొడవలు కారణంగానే ఇలాంటి కేసు పెట్టినట్లు ఒప్పుకుంది.