వరుస కాదన్నందుకు.. యువతి ఏం చేసిందంటే?

praveen
ప్రేమ అంటే ఒక మధురమైన జ్ఞాపకం.. రెండు మనసుల మధ్య ఎప్పుడు ఏ క్షణంలో ప్రేమ చిగురిస్తుంది అన్నది  చెప్పలేని విధంగానే ఉంటుంది. ఇక రెండు మనసుల మధ్య చిగురించిన రెండక్షరాల ప్రేమ ఏకంగా రెండు జీవితాలను ఒక్కటయ్యేలా చేస్తూ ఉంటుంది.  అంతేకాదు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కూడా ఇస్తూ ఉంటుంది ఇక ఇదంతా నేటి రోజుల్లో కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక నిజ జీవితం విషయానికి వస్తే ప్రేమ అంటే పరువు హత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.


 ప్రేమ అంటే మోసానికి చిరునామాగా మారిపోయింది. ప్రేమ అంటే అవసరాలను తీర్చుకునేఒక వస్తువుగా మారిపోయింది. ఇక ప్రేమ ఎంతో మందినీ మనస్థాపానికి గురి చేస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకు వస్తుంది. ఇలా ప్రేమ కారణంగా ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఆ యువతి. కానీ వరస కాదు అని అన్నందుకు క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.


 ఈ ఘటన పాలకుర్తి మండలం లో వెలుగులోకి వచ్చింది. మండలంలోని మల్లం పల్లి గ్రామ శివారు పెద్ద తండా కు చెందిన ప్రియాంక అదే తండాకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇక ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే వీరి ప్రేమ విషయం చివరికి ప్రియాంక తల్లి దండ్రులకు తెలిసింది. దీంతో కూతురుని పిలిచిన తల్లిదండ్రులు వరుస కాదని అతని మర్చిపోవాలి అని మందలించారు. దీంతో చివరికి ప్రియాంక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది ప్రియాంక. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: