డీజిల్ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ఎందుకో తెలుసా?
ఇలా వాహనాల వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో తరచూ పెట్రోల్ బంకులకి వెళ్లడం ఎందుకు అని ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు వాహనదారులు. కానీ అటు బంకు సిబ్బంది మాత్రం ఇక మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే లోకల్ పెట్రోల్ కంటే బంకులో ఉండే పెట్రోల్ ఎంతో నాణ్యమైనది అని నమ్ముతూ ఉంటారు. ఇక బంకులో పెట్రోల్ డీజిల్ కొట్టిస్తే ఇక ఇంజన్ కూడా ఎంతో బాగుంటుందని అనుకుంటారు. కానీ ఇక్కడ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వాహనాలు మాత్రం స్టార్ట్ అవ్వలేదు.
అదేంటి బంకులో నాణ్యమైన పెట్రోల్ కొట్టించిన తర్వాత కూడా వాహనం స్టార్ట్ అవ్వటం లేదు అని వాహన యజమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసి మాత్రమే అవాక్కయ్యారు. ఆ బంకులో డీజిల్ కొట్టించి చివరికి ఉద్యోగులకు స్వయంగా చిల్లు పెట్టుకున్నాము అన్న విషయాన్ని గ్రహించారు. ఇక ఈ ఘటన హైదరాబాద్ లోనే పెద్ద అంబర్పేట్ లో వెలుగులోకి వచ్చింది. పెద్ద అంబర్పేట్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
ఏకంగా నీళ్లతో కలిపినా డీజీల్ వాహనదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు వాహన యజమానులు. ఈ క్రమంలోనే బంకులో డీజిల్ కొట్టించిన వెంటనే వాహనాలు మొత్తం పూర్తిగా ఆగిపోయాయ్ అని వాహనదారులు చెబుతున్నారు. అయితే ఇదేంటని డీజిల్ ను పరీక్షిస్తే లీటరుకు మూడు వంతులు నీళ్లు కలిపినట్లు గుర్తించారు. ఇదే విషయంపై పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇలా ఎంతమంది వాహనదారులను మోసం చేస్తున్న ఈ బంకులను సీజ్ చేయాలంటూ ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం..