శివరాత్రికి ఉపవాసం ఉండలేదని.. భార్యను చంపేశాడు?
కానీ ఇక్కడ శివరాత్రి రోజున ఉపవాస దీక్ష పూనుకోకపోవడమే ఆ మహిళల పాలిట శాపంగా మారింది. ఉపవాసం ఎందుకు ఉండలేదు అంటూ గొడవ పెట్టుకున్న భర్త చివరికి భార్యను దారుణంగా హతమార్చాడు. శ్రీకాకుళం జిల్లా రూరల్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2015 లో నవీన్ కళ్యాణి పెళ్లి జరిగింది. అయితే నవీన్ కు సోదరి అంటే ఎంతో ప్రేమ. ఆమే ఏం చెప్పినా కరెక్ట్ అంటూ చెబుతూ ఉంటాడు. ఇటీవలే నీ భార్యను కూడా ఉపవాసదీక్ష చేయమని చెప్పు అంటూ నవీన్ కి సూచించింది సోదరి. ఇక ఇదే విషయాన్ని భర్త తన భార్యకు చెప్పాడు.
కానీ తాను మాత్రం ఉపవాసదీక్ష చేయలేను అంటూ తెగేసి చెప్పింది సదరు భార్య. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు భర్త. అక్క చెప్పిన విధంగా ఉపవాసం ఉంటే నష్టం ఏంటి అంటూ భార్యను నిలదీస్తాడు ఉపవాసం ఉండటం తనకు ఇష్టం లేదు అంటూ కళ్యాణి చెప్పడంతో.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి ఆగ్రహంతో ఊగిపోయిన నవీన్ భార్య కల్యాణి మొహం పై తల దిండు పెట్టి తన ఊపిరి ఆడకుండా చేసి చివరికి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు నవీన్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్హం..