అర్ధరాత్రి ఆకలేసింది.. సైకోగా మారిన ప్రియుడు.. చివరికి?
అంతేకాదు చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో సాటి మనుషుల ప్రాణాలను ఏదో చాక్లెట్ తిన్నంత ఈజీగా తీసేస్తున్న ఘటనలు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి అనే చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ప్రేమించిన ప్రియురాలు పైన దారుణంగా దాడి చేసాడు ఇక్కడ ఒక వ్యక్తి. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నరోడా ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడు ప్రియురాలిని ఆహరం కావాలంటూ అడిగాడు. కానీ ఆమె నిరాకరించడంతో చివరికి ప్రాణాలు తీసాడు.
తేజల్ ఠాగూర్ అనే బాధిత యువతి మాట్లాడుతూ పెళ్లి కాక పోయినా ప్రియుడితో కలిసి ఉంటున్నానని.. అయితే ఇటీవలే అర్ధరాత్రి సమయం లో వచ్చి ఆహారం కావాలని అడగడంతో ఇక ఆ సమయం లో ఆహారం లేదు చెప్పాను. దీంతో ఇక అతను నాపై కోపం పెంచుకున్నాడు. చివరికి టేబుల్ ఫ్యాన్ తో దారుణం గా కొట్టాడు అంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఒకవేళ పోలీసులకు చెబితే ప్రాణాలు తీస్తాను అంటూ అజయ్ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడంటూ ఫిర్యాదులో పేర్కొంది సదరు యువతి. ఇక యువతి ఫిర్యాదు తో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.