నిద్రిస్తున్న బాలికను లేపి.. ఎంత పని చేసాడు?
వివరాల్లోకి వెళితే.. హర్యానా లోని గురుగ్రామ్ కు చెందిన పదహారేళ్ల బాలిక ను కారులో తీసుకెళ్లిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఫరూక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఉండే బాలిక ఇంట్లో నిద్రొస్తుంది. ఇక అర్ధరాత్రి సమయం లో అదే గ్రామానికి చెందిన సంజయ్ బాలికను కిటికీ లో నుంచి పిలిచాడు. ఇక కారు లో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తాను ఎంతో అద్భుతం గా ఉంటుంది అంటూ మాయ మాటల తో నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాలిక కారులో సంజయ్ తో బయటికి వెళ్లి అదే అదునుగా భావించిన సంజయ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
చివరికి ఉదయం సమయం లో ఆ గ్రామం లోని పాఠశాల గేటు ముందు ఆ బాలికను దింపి అక్కడి నుంచి వెళ్ళి పోయాడు. బాలిక ఇంటికి రాక పోవడంతో భయ పడి పోయిన తల్లిదండ్రులు కూతురు అదృశ్యం అయినట్లు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగం లోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. బాలిక పాఠశాల గేట్ వద్ద ఉండటాన్ని గుర్తించారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఇక చివరికి అత్యాచారం జరిగింది అన్న విషయాన్ని గ్రహించారు. కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టు కోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు..