ఛీ ఛీ.. ఒక కానిస్టేబుల్ అయ్యుండి.. ఇలా చేస్తాడా?
అంతేకాదు నేటి రోజుల్లో ఆడపిల్ల పుడితే బాగుండు అని దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే ఇలా ఆడపిల్లలపై వివక్ష చూపకపోవడంతో ఆడపిల్లల సంఖ్య కూడా దేశంలో పెరిగిపోతుంది. కానీ నేటి ఆధునిక సమాజంలో కూడా ఇంకా ఎంతోమంది ఆడపిల్లలను భారం గా భావిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మూడు కాన్పుల్లో కూడా ఆడపిల్లలు పుట్టారు ఇక మగపిల్లాడు పుట్టలేదు అనే కారణంతో కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడూ ఇక్కడ ఒక ప్రబుద్ధుడు.
ఈ క్రమంలోనే విడాకుల నోటీసు లో సంతకం పెట్టడానికి నిరాకరించిన భార్యను కూడా దారుణంగా హత్య చేయబోయాడు. ఇలా నీచంగా ప్రవర్తించింది ఒక సాదాసీదా వ్యక్తి కాదు. ఎంతో బాధ్యతాయుతమైన పోలీస్ పదవిలో కొనసాగుతున్న కానిస్టేబుల్. ఈ ఘటన తిరువల్లూరు జిల్లా ఎమ్మిగనూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన రాజేంద్రన్ సచివాలయం పరిధిలో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తూ ఉంటాడు. ఇక ఇతనికి అదే ప్రాంతంలో ఉండే పూర్ణిమ అనే మహిళతో 2005లో వివాహం జరిగింది.
అయితే తనకు కొడుకు పుట్టాలని ఎంతగానో ఆశ పడేవాడు రాజేంద్రన్. కానీ మూడు కాన్పులలో కూడా ఆడపిల్లలు పుట్టారు. దీంతో ఎంతగానో నిరాశలో మునిగిపోయాడు. ఇక మగబిడ్డ పుట్ట లేదని భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడూ. ఇక విడాకుల నోటీసు పై సంతకం పెట్టాలంటూ రాత్రి భార్యతో ఘర్షణకు దిగాడు. అయితే భార్య మాత్రం విడాకులకు అంగీకరించకపోవడంతో చివరికి ఉన్మాదిగా మారి పోయి కత్తితో దాడి చేశాడు. ఇక అడ్డొచ్చిన కుమార్తెను కూడా గాయపరిచాడు. ఇక ఆ తర్వాత మంజూర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు రాజేంద్రన్. దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య కుమార్తెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.