భీమ్లా నాయక్ టికెట్ కోసం.. గొంతు కోసిన యువకుడు?
ఇక పవన్ కళ్యాణ్ కి తగ్గట్లుగా పలు రకాల మార్పులు చేయడం అదే సమయంలో మాటల మాంత్రికుడు సినిమాకు పవర్ ఫుల్ డైలాగులు రావడంతో ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి అసలు సిసలైన పవర్ ఫుల్ సినిమా కావాలి అని ఎంతగానో ఎదురుచూస్తూ అభిమానులందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా ఉంది అని చెప్పవచ్చు. ఇకపోతే భీమ్లా నాయక్ సినిమాను చూసేందుకు అటు ప్రేక్షకులందరూ థియేటర్లకు తరలి వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్ని థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ భీమ్లా నాయక్ టికెట్ విషయంలో తలెత్తిన చిన్న గొడవ కారణంగా ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయి గొంతు కోసిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణలోని పాల్వంచలో వెంకటేశ్వర థియేటర్ లో భీమ్లా నాయక్ టికెట్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో కొత్తగూడెం కు చెందిన మధు అనే వ్యక్తి షరీఫ్ అనే యువకుడు గొంతు కోశాడు. ఇక షరీఫ్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం షరీఫ్ కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.