కూతురును చంపేసిన తల్లి.. ఎందుకో తెలుసా?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. యువతీ యువకుల మధ్య ప్రేమచిగురించింది. అన్ని కులమతాలకు అతీతంగా ఒక్కటవ్వాలి అనుకున్నారు. కానీ ఈ విషయం తెలిసి ప్రాణాలు తీయాలని డిసైడ్ అయింది యువతి తల్లి. ప్రేమ వ్యవహారాన్ని మానుకోవాలి అంటూ తల్లి ఆ యువతికి సూచించింది. దీంతో ఇక వేరే కులం వాడిని ప్రేమిస్తూ కూతురు పరువు తీస్తుంది అని భావించిన తల్లి కన్న పేగు బంధాన్ని మరిచింది. దీనికోసం తన ప్రియుడి సహాయం తీసుకొని కన్నకూతురిని దారుణంగా హత్య చేసింది. ఇక కూతురి హత్య ను అటు ఆమె ప్రేమించిన ప్రియుడిపై తోయాలని నిర్ణయించుకుంది.
కానీ చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. జహీరాబాద్లో మూడు రోజుల క్రితం సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసు కొలిక్కి వచ్చింది. హుగ్గలి మండలానికి చెందిన బుజ్జమ్మ కూతురు అదే గ్రామానికి చెందిన ఫకీర్ ను ప్రేమించింది. అయితే కూతురు ప్రేమ విషయం తల్లికి నచ్చకపోవడంతో ప్రేమ దోమ లేదు మానుకోవాలి అంటే హెచ్చరించింది. కానీ కూతురు తీరులో మార్పు రాకపోవడంతో కసాయి గా మారిపోయిన తల్లి దారుణంగా కూతుర్ని హత్య చేసింది. పెళ్లి కోసం ప్రియుడు నర్సింహులు సహాయం కోరింది. ఇక కూతురు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది అని తనకు కూతురు ప్రేమించిన యువకుడు పైన అనుమానం ఉంది అంటూ కొత్త నాటకం మొదలు పెట్టింది. కానీ పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.