నిత్య పెళ్ళికొడుకు.. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడంటే?

praveen
నేటి రోజుల్లో ఎక్కడ చూసినా మోసగాళ్ళు ఎక్కువై పోతున్నారు. మాయ మాటలతో నమ్మించి ఏదో ఒక విధంగా జనాల్ని బురిడీ కొట్టించడానికి రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా మంచి వాళ్ళం అనే ముసుగులో ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. అతను ఒక పెద్ద డాక్టర్.  డాక్టర్ అన్న తర్వాత బాగానే సంపాదిస్తాడు కదా. బాగా ఆస్తులను సంపాదించాడు. ఈ క్రమంలోనే పెళ్ళికూడా చేసుకున్నాడు. అయితే ఒకటి కాదు ఏకంగా 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు.



 డాక్టర్ కదా బాగా సంపాదిస్తాడు అందుకే 14 పెళ్లిళ్లు చేసుకున్నాడేమో అని అనుకుంటున్నారు కదా. అసలు ట్విస్టు ఏమిటంటే అతను డాక్టర్ కాదు.. డాక్టర్ అంటూ మాయమాటలు చెప్పి ఏకంగా 14 మంది వివాహం చేసుకున్న వ్యక్తి ఇటీవలే భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక కాస్త వివరాల్లోకి వెళితే ఇటీవలే ఓ మహిళ భర్త చేతిలో మోసపోయాను అంటూ పోలీసులను ఆశ్రయించింది. ప్రకాష్ స్వయిన్ అనే వ్యక్తి పై ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా పోలీసులే షాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి.


 1982లో వైద్యుడిని అంటూ నమ్మించి ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు ప్రకాష్. ఇక 20 ఏళ్ల తర్వాత 2002లో కూడా ఆరోగ్య విభాగంలో ఉన్నతాధికారిని అంటూ మాయమాటలు చెప్పి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇక మాట్రిమోనీ సైట్లలో పెళ్లి చేసుకోకుండా వయసు మళ్ళిన మహిళలను టార్గెట్ గా చేసుకుని ఇక చిరునామాలు తన ఉద్యోగ స్థాయిలు కూడా మార్చుకుంటూ మొత్తంగా 14 మందిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు విచారణలో బయట పడింది. ఇక ఇలా పెళ్లి చేసుకున్నప్పుడల్లా వధువు కుటుంబం నుంచి  భారీగా కట్నం వసూలు చేయడం చేశాడట. ఇక నిందితుడిని రిమాండ్కు తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: