భర్త అంటే ప్రత్యక్ష దైవం అంటారు..అందుకే అతణ్ణి ప్రత్యేక శ్రద్దగా చూసుకుంటారు.. అది ఒకప్పుడు మాట .. కానీ ఇప్పుడు వేరే.. భర్త నచ్చకపోతే వేరే వ్యక్తి తో వెళ్తారు.ఇంకా చెప్పాలంటే భర్త వుండగానే మరో వ్యక్తిని పెళ్ళి చెసుకుంటారు.. ఇప్పుడు ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త పరిస్థితి బాగాలెదని భావించిన భార్య ప్రియుడిని పెళ్ళి చేసుకుంది..ఇద్దరు పిల్లలు వున్నా కూడా ఆమె ఆలొచించ లేదు.. ఇది ఆలోచించాల్సిన విషయమే..
వివరాల్లొకి వెళితే..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సోనభద్ర జిల్లాలో నివసించే మమత అనే యువతికి నాలుగేళ్ల క్రితం రాజీవ్ అనే యువకుడిని పెళ్ళి చేసుకుంది.అతను జాబ్ చేస్తూ పెళ్ళాం ను పొషిస్తాడు.అలా కొద్ది రోజులు బాగానే వున్నారు. ఉద్యోగం చేస్తూ భార్య, పిల్లల్ని బాగా చూసుకునేవాడు. జీవితం సాఫీగా గడిచిపోతుందనుకుంటున్న సమయంలో మమతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు రాజీవ్‌కు తెలసింది. ఆ విషయం పై భర్త నిలదీసాడు. అయితే ఆమెలో ఎటువంటి మార్పు లేదు. రాజీవ్‌ను వదిలి తన ప్రియుడు లవకుశ్నే వివాహం చేసుకోవాలని అనుకుంది.
అనుకున్న విధంగానె ఒకరోజు చేసింది.రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నాక మమత తన ప్రియుడు లవకుశ్ని ఇంటికి పిలిచింది. ఆ సమయంలో రాజీవ్ నిద్రపోతున్నాడు. అప్పుడు మమత తన ప్రియుడి సహాయం తో ఇంట్లోని ఒక హోస్ పైప్ గొంతుకు బిగించి ఉరి వేసింది.. అతను చనిపొయాడని నిర్దారించుకుని అతని శవం సాక్షిగా ప్రియుదిని వివాహం చేసుకుంది. అది కాక ఆమె పెళ్ళి చేసుకుంటూన్న సమయంలొ పిల్లలు కూడా వున్నారు. ఇది నిజంగానే దారుణం. అతను చనిపోవడం తో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రంగం లోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమెను, ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..