బాలికను వేధించిన టిడిపి నేత ఇల్లు సీజ్?
విజయ వాడలోని భవాని పురం కుమ్మరి పాలెం లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఎన్నో ఊహించని విషయాలు బయటకు వచ్చాయి. స్థానికం గా ఉండే తెలుగుదేశం కి చెందిన పార్టీ నేత వినోద్ జైన్ తొమ్మిదో తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం బయట పడింది. చివరికి ఇక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనం గా మారింది.
ఇక బాలిక చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాయగా ఈ లేఖలో వినోద్ జైన్ లైంగిక వేధింపుల కారణం గానే ఆత్మహత్య చేసుకుంటున్న దీనికి కారణం వినోద్ జైన్ అంటూ బాలిక పేర్కొంది. ఇక నుండి రంగం లోకి దిగిన పోలీసులు అరెస్టు చేసి అతని ఇంటిని కూడా సీజ్ చేశారు.. అయితే ఇతను గతం లో కార్పొరేషన్ ఎన్నికల్లో 37 వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసాడు. బాధితులకు న్యాయం చేస్తామని నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది