12 మంది బాలికలపై రేప్.. కోర్టు షాకింగ్ తీర్పు?

praveen
ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇంటి నుండి  ఆడపిల్ల కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్న నిందితులకు కఠిన శిక్షలు పడుతూ ఉండడం అందరిలో కాస్త ధైర్యం కలుగుతుంది అన్న విషయం తెలుస్తుంది. ఇప్పటికే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారికి కోర్టులు ఎన్నోసార్లు కఠిన శిక్ష విధించాయ్. ఇప్పుడు మరోసారి ఇలాంటి కఠిన శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. 12 మంది బాలికలపై మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఒక కీచక టీచర్ అతనికి సహకరించిన మరొకరికి కోర్టు ఇటీవల యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

 మరోవైపు ఇక ఈ వ్యవహారం బయటకు రాకుండా సహాయం చేసిన మేనేజర్ కు సైతం ఆరు నెలలు జైలు శిక్షతో పాటు రూ 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం ఏనామీది తండాలో విలేజ్ ఆర్గనైజేషన్ సంస్థ గిరిజన పిల్లలకు చదువు చెప్పేందుకు పాఠశాలను ఏర్పాటు చేసింది. ట్యూషన్ సదుపాయాన్ని కూడా కల్పించింది. ఇక చదువుకునే పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు అదే గ్రామంలో చదువుకున్న రామావత్ హరీష్ ను నియమించింది. పిల్లలకు చదువులు చెప్పాల్సింది పోయి హరీష్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఏకంగా బాలికలను లొంగదీసుకునీ 12 మంది బాలికలపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన 2014లో బయటపడింది.

 ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం గానే మారిపోయింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఎంతోమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరిపారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా కోర్టులో సమర్పించగా 11 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈ కేసులో 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడి ప్రధాన నిందితుడిగా ఉన్న హరీష్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. అదే సమయంలో సహకరించిన శ్రీనివాసరావుకు కూడా ఇదే శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇక వీరికి సహకరించిన ట్యూషన్ మేనేజర్ సరితకు ఆరు నెలలు జైలు శిక్షతో పాటు రూ 10 వేల జరిమానా విధించింది. ఇక ఈ కేసులో నిందితులను నల్గొండ జైలు కు తరలించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: